కవన రవళి
30-05-24 హైకూలు…
స్వార్థపరుని
చేతిలో సారథ్యము
చావు కబురు… 1.
అకాల వర్షం
ఆదుకోని ప్రభుత
పాలనెందుకు… 2.
కల్తీ లేనిది
కాలుష్యం అంటనిది
మాతృ ప్రేమలో….. 3.
అవినీతికి
కొమ్ము కాయకపోతే
మనలేమేమో…..? 4.
నోరున్నోడికి
ఊరప్పజెప్పమంది
పోరలేకనే…. 5.
విద్య వైద్యము
నాణ్యతుంటే చాలదా
ఉచితాలొద్దు..6.
కాల్పుల్లంఘన
లెక్కలు పెట్టుకున్నాము
….
గొప్పలు చెప్పి (నాడు)…….7.
సద్దు మణిగె
సరి ప్రణాళికతో
సమయములో… 8.
స్నేహ బంధాలు
వాట్సాపు కొమ్మమీద
వాలిపోయాయి…9.
బాధ్యతలతో
భార్యాభర్తల బంధం…
జోడెడ్ల బండి……. 10
నగునూరి రాజన్న
No comments:
Post a Comment