Saturday, July 27, 2024

బాలల గేయం తేది : 16-07-2024 శీర్షిక : చిన్ని చిన్ని పాపలు

 బాలల గేయం 

తేది : 16-07-2024
శీర్షిక : చిన్ని చిన్ని పాపలు 

చిన్ని చిన్ని పాపల్లారా 
చిరునవ్వుల దివ్వెల్లారా 

గలగల మాటలు నేరవండి 
కిల కిల పాటలు పాడండి 
వేదికలంటే భయమే వద్దు 
వేడుకలన్నీ మీకొరకేను...  

దరహాసాలుగా వెలుగుతూనే  
చిరునవ్వులు చిందించండి .... 
అందరిని ప్రేమిస్తూనే 
సమైక్య భావం చాటండి ... 

చిన్ని చిన్ని పాపల్లారా 
చిరునవ్వుల దివ్వెల్లారా 

అమ్మంటే వందనమంటూ  
నాన్నంటే గౌరవం ఇవ్వండి ...  
గురువంటే  భక్తిచూపుతూ 
మిత్రులకు ప్రేమ పంచండి ..... 

మొక్కలెన్నో పెంచుతూనే 
పచ్చదనం  పంచండి   .... 
కలుషితాలు దూరముంచి 
కాలుష్యాలను తగ్గించండి  ....  

చిన్ని చిన్ని పాపల్లారా 
చిరునవ్వుల దివ్వెల్లారా 

పంటలనిష్టం చేసుకుని  
రైతంటే ప్రేమలు చూపండి ... 
ఆహారమంటే  అపురూపం 
వృధానంతా  అరికట్టండి   .... 

దేశమును ప్రేమిస్తూనే 
జవానంటే గౌరవించండి -- 
జండాకు వందనమని 
జగమంతా చాటిచెప్పండి  .... 
చిన్ని చిన్ని పాపల్లారా 
చిరునవ్వుల దివ్వెల్లారా 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment