చదువు
తేది 26-06-2024
శీర్షిక : సమున్నత సంస్కారం
విద్య లేనివాడు వింత
పశువన్నారు విజ్ఞులు ...
చదువు నేర్పు సమున్నత
సంస్కారం ...
రాతిగుహల జీవితం
రంగుభావనాల్లోకి మారినా ...
కాలి నడకలను కాస్తా
కనుమరుగు చేసిన రవాణా
సాధనాలైనా ...
పారిశ్రామిక ప్రగతికి
దారి వేసినా ...
కాల గణనల కవాతు చేసినా ...
సాంకేతికతల సంబరాలకు
మార్గం చూపినా...
ఖగోలం లోని వింతలను
పరిచయించినా ....
అన్నింటికీ మూలమైనా...
ఆత్మీయతలు మరువరాదు
అనురాగాలు విడువరాదు ...
ఆప్యాయతలు తగ్గరాదు ...
మానవత్వం మరచిననాడు
మనిషి చనిపోయినట్టే ....
ముందడుగేదైనా మానవ
కళ్యాణం కోరుకుంటేనే ....
దోచలేని సంపద దోశెడు
బలపాలతో వచ్చే విద్య ...
విజ్ఞానాలకు మూలము ...
విచక్షణలకు సమస్తము ...
ఆడపిల్లలు చదివితే
కుటుంబమే బాగుపడు ...
కుటుంబాలే సంఘము
సంఘాలే దేశము ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment