సరిహద్దులు
తేది: 10-07-2020
శీర్షిక: పరిమళించు మితృత్వం...
సంఖ్య: 462
మనసే మనిషికి కనపడని శత్రువు
మానవీయత కొరవడితే మాటు వేయు
మతులు గతులు తప్పి మసులుకొను
సుద్ది బుద్దులు హద్దులు దాటు......
కాల ప్రమాణంలో యుగాలు మారినా
కబంధ హస్తం వీడని కపటత్వం
స్వార్థాలను చంకనేసుకుని పొంచి
సరిహద్దు కంచెన నిలిచె...కసాయి శత్రువు....
కొండా కోనలే కోణంగి నేస్తాలుగా
వాగు వంకలే వసతి సౌకర్యాలుగా
చిన్న చిన్న డేరాలే మిణుకు మిణుకు ఆశలై
అమ్మ ఆలి పిల్లల జ్ఞాపకాలే మనసు
తెరమీద నాట్యమాడే తీపి ముచ్చట్లుగా......
మంచు కప్పుకున్న చలి దుప్పట్లతో
ఎండ వానలే ఎదురయ్యే బంధువులుగా
పగలు రాత్రిల తేడా లేని పహారాలతో
ప్రకాశిస్తున్న మన సైనికుడు భగ భగమనే భానుడై...
మనిషికైనా మనసుకైనా దేహమైనా
దేశమైనా రేఖా మాత్ర హద్దులుంటేనే
ముద్దు ముద్దు ...పల్లవించు ప్రమోదము
వెల్లువెత్తు మానవత్వం పరిమళించు మితృత్వం....
నగునూరి రాజన్న
కరినగరము.