కవన రవళి : మీ పాట మీ నోట
అంశం: బాలల గేయం
తేది : 16-07-2024
శీర్షిక :
తెలవవోయి బాలకా
తెలవవోయి బాలకా
తెలుగువీర లెమ్మికా ....
మాతృభాష తెలుగు
మరవకెపుడు దాని వెలుగు
అమ్మనోట పలుకు
అభ్యసించు భాష కులుకు ....
వల్లె వేయవోయి
వరసపెట్టి. వర్ణమాలను ...
అక్షరాలకై దీక్ష బూని
గుణింతాలను నేరవండి...
తెలవవోయి బాలకా
తెలుగువీర లెమ్మికా ....
అక్షరాలు వర్తులాకారం
అనువైన సమ ఉఛ్చారణం
అచ్చులు హల్లులు
ఉభయాక్షరములు నాసికములు...
ఒత్తులన్నీ ద్విత్తం సంయుక్తం
విశ్వమందు అద్వితీయం
పదాలన్నీ వింతగొలుపగ
అచ్చులతోనే పదాలు అంతం
తెలవవోయి బాలకా
తెలుగువీర లెమ్మికా ..
పరభాషలెన్ని నేర్చినా
మాతృభాషకు సరితూగవు ...
అవసరార్థం నేర్చుకున్నా
అమ్మ భాషను మరువకు సుమా ...
పలు భాషల పండితులకు
కొదువలేదు తెలుగునాట...
వడికలిగిన నుడికారం
మనదేనని నినదించారు ....
తెలవవోయి బాలకా
తెలుగువీర లెమ్మికా ..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment