అంతా కవితమయమేనోయి
తేది : 14-06-2024
శీర్షిక :
యద్భావం తద్భవేత్
యద్భావం తద్భవేత్ లా
రవిగాంచని చోటు కవి గాంచెనన్నటుల
మాటేదైనా మతలబులమూటగా
భావమేదైనా భావతరంగిణులుగా …
ఉదయాత్పూర్వమున
మెలకువ మొదలు
చక్రము పోలిన దినమంతా
మొదలిడిన ప్రతిపనిలో
కలవరింతల పలవరింతలే ...
ఏర్చికూర్చిన ఆకర్షణీయమైన
అక్షరాల మాలలతో...
అలంకారాల అందాలను పొందుపరిచి...
పదబంధాలను పదిలపరుచుచు...
అభివ్యకరణల ఆధునీకరణలతో...
కుక్కుటముల కోలాహలము
శుకపికముల కువకువలు
గోమాతల అంబారవములు
ఆలయములోని సుప్రభాతము ....
తొంగి చూస్తున్న లేలేత
బాలభానుని భంగిమలు
నునువెచ్చని కిరణములతో
అలకబూనిన తుషారబిందువులు ....
అరవిరిసిన కమలపు
కనుదోయిలతో ఇంతులంతా
కళ్ళాపి వాకిళ్ళలో హరివిల్లుల
ముగ్గులతో భూపాలానికి ఆహ్వానం ....
సప్తవర్ణాల ఉషస్సును వంపుకుని
సరాగాలు ఉత్సాహాలు నింపుకుంటేనే
ఆరోగ్యాల సిరిసంపదలు ...ఆహార నిల్వలు
అనంత విశ్వంలో అరమరికలెఱుగని
తుళ్ళింతలు ....
వడివడిగా అడుగులేస్తూ పిల్లలకు
పాలివ్వాలనే తొందరలో
అమ్మపశువుల ఆరాటాలతో
మారుతమయ్యే గోధూళి మలి సంధ్యలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment