ఎంత హాయి ఈ రేయి
తేదీ : 07-06-24
శీర్షిక : కమ్మని క్షణం
మాఘ మాస మధురిమలు
మల్లెపూల ఘుమఘుమలు
పున్నమినాటి వెన్నెలలు
మరువలేని హాయిలే సుమా ....
కోరుకున్న మనస్వినితో
కొంగుబంగారమైన వేళలలో
కోటి తారకలను మీటిన
కొంగొత్త రాగమేదో పలకరించగా ....
మదిలోని కోయిలలు
మధురరాగ ఆలాపనలే ....
సుమహారముల మనోహరమే
సుందరమగు నందనం .....
అనుకున్నదే జరిగినదని
ఆశల లహరుల సంగీతము ....
మదివీణలు మీటిన శుభతరుణం
మననములే మదికానందం .....
కదిలిపోయిన ఆనాటి
కమ్మని క్షణం పులకింతలే ....
జ్ఞాపకాల పందిరిలో
కరుణించిన కవ్వింతే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment