Friday, July 26, 2024

మమతల్నీ మళ్ళీ చిగురింపచేద్దాం తేది : 31-05-2024 శీర్షిక : వెలుగు పూలు పూయిద్దాం

 మమతల్నీ మళ్ళీ చిగురింపచేద్దాం

తేది : 31-05-2024
శీర్షిక : వెలుగు పూలు పూయిద్దాం 
సహస్రాధికం 

ఉరుకుల పరుగుల జీవితాలలో 
ఆత్మీయతలు అనురాగాలు 
కొంత దూరమయి... భారాలతో 
జీవితాలు చిన్నాభిన్నమే .... 

అప్పుడప్పుడు అలకల గీతం 
ఆలపిస్తేనే ముద్దు మురిపం ...అనుభవాలతో  
అనురాగ తీగ సవరించాలి.... మౌనగీతం 
శృతి చేయాలి... మాట పట్టింపులు మన్నించాలి ..

శిశిరంలో మోడువారిన తరువులు 
వసంతంలో చిగురించినట్లు... 
వాడిన బంధాలకు మమతల 
అమృత బిందువులను  చిలకరిస్తే  
ఎడారిని తలపించే  బీడులు 
మొక్కలు నిండిన  కొత్త చిగుళ్లతో 
హరిత వనమేగా మనిషి మానసం .... 

మాటే మంత్రం మాటే తంత్రం 
మాటల పరిమళాలద్దితే మారని 
మనసుంటుందా ... పెద్ద పెద్ద 
యుద్ధాలే నిలిచిపోతాయి .... 

కరుణ రసాన్ని నింపుకుని 
మోడువారిన తరువులకు 
మమతల చివుళ్ళను చిగురింపజేసి 
ఆత్మీయ అనురాగ లాలింపులతో 
వెలుగుపూలు పూయిద్దాం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment