Saturday, July 27, 2024

చిత్ర కవిత తేది : 30-06-2024 శీర్షిక : అమ్మతనం .

 చిత్ర కవిత 

తేది : 30-06-2024
శీర్షిక : అమ్మతనం ... 

కొండంత అమ్మ ప్రేమ 
కొసిరి కొసిరి తినిపించడమే ... 
చిట్టి కడుపుల చింతలు తీర్చంగ  
చిరు చేపను నోటికందించే ... 

కడుపు కట్టుకుని అయినా 
కన్నవారి కడుపులు నింపు... 
పాస్తులతోనైనా తాను 
పరవశించి మురియును .... 

యుక్త వయసు వచ్చువరకు 
చేవకలిగి ఎగురువరకు 
ప్రయోజకులను చేసినాక 
పరవశించి మురియును .... 

జ్ఞానమెరుగని ఘడియలలో 
జీవగడియారంగా మారిపోవు ... 
గడియకొక్కసారి వంతున 
జవజీవాలు మెతుకవుతుంది .... 

అక్కడక్కడా అమ్మలలో 
కర్కశత్వం  కానవచ్చినా ... 
అమ్మతనం ముందు 
అలాంటివన్నీ చిన్నబోయేవే .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment