Friday, July 26, 2024

పర్యావరణ సోయి తేది : 05-06-2024 శీర్షిక : నిండా మునుగుతున్న అలసత్వం...

 పర్యావరణ సోయి 

తేది : 05-06-2024
శీర్షిక : నిండా మునుగుతున్న అలసత్వం... 
సహస్రాధికం ... 

ప్రమాదమంచున నిలబడ్డాం 
పరివర్తన ప్రతిజ్ఞలెన్నో చేసాం ... 
పక్కోడి పనిలా ఆవరించిన నిర్లిప్తత 
ఎక్కడెదిగిపోతాడోనని నిష్టూరాలు .... 

ఉల్లిపొరల్లా పెయ్యంతా ఒలుచుకుంటూ  
తల్లి కడుపులో ఉండగా తన్నినట్టు 
ధాతువులని బొగ్గని ఇంధనాలని   
చీల్చుతూ  పోతుంటే చివరికి అవని శూన్యమే ... 

అదే కాకుండా ... 
పాలిథీన్లతో ప్రాణహాని అన్నా వదలక 
వీర లెవెల్లో విస్తరాకుల బడాయిలు  .... 
డిస్పోసబుల్ నీళ్ల గ్లాసులు డాంబికాలు... 
చప్పున పీల్చే ఛాయ గ్లాసుల గొప్పలు....  

అతి కష్టం మీద ఎక్కడో ఒక్కరు 
సోయికొచ్చి ఎవరైనా సోల్తి దీసి 
మాట్లాడితే ... పెద్ద చెప్పొచ్చావులే ... 
అంటూ నిటూర్పుల నీరు గారే మాటలు ... 

నిండా మునుగుతున్నా...అలసత్వం... 
నిక్కచ్చిగా నిలబడ్డ వారిని నిలువునా 
నీరుగార్చే వింత ప్రయత్నం ... 
ఆలోచనలను అటకెక్కించే తత్వం ... 

మాట చెబితే వినే రోజులు కానరావు ... 
తాట తీసే సెక్షన్లుండాలి... జీవరాశులేవి 
కాట కలిసి పోకుండా కాపాడుతూ నిఖార్సుగా 
మాటు వేసే నిఘాలుండాలి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment