మంచితనం
శీర్షిక : సత్తా ఉన్న శాంతి మంత్రం ...
రూపమే ఉంటే .... అచ్చంగా
మా నాన్నలా ప్రశాంత వదనం
చిరునవ్వుల దరహాసం ...
పరిచయం లేని పలకరింపులా ....
అందరు బాగుండాలి
అందులో నేనుండాలనుకోవడం ....
పొరుగు క్షేమం పొందు లాభంలా
చుట్టూరా చుట్టాల్లా బాగుండాలని
అనుకోవడం ....
పొరుగును కరిగించే పలకరింపు
మరుగనేదే లేకుండా భోళాగా
మాట్లాడటం ... చేతిలో ఉన్నది
ఉన్నపళంగా పంచగలగడం ....
చేతనైన సాయానికి అడుగు
ముందుకు వేయడం ...
చెప్పకుండానే మనసు
తెలుసుకుని మసలడం ....
చీమకైనా కీడు తలపెట్టాలంటే
కోటిసార్లు ఆలోచించడం ....
మచ్చుకైనా స్వార్థం లేకపోవడం
కపటత్వం కక్షలు కార్పణ్యాలు ఆమడ దూరం ...
శత్రువుకైనా మిత్రుత్వం పంచడం ...
కొన్నిసార్లు స్వతహాగా మంచివారైనా
పరిస్థితులు కూడా పరీక్షిస్తాయి ...
మనుషులను లొంగదీసుకుంటాయి ....
మమతలకు మబ్బుతెరలడ్డొస్తాయి ....
ఏదేమైనా సత్తా ఉండి శాంతి మంత్రం
పఠిస్తేనే ఫలితం వందరెట్లుంటది ....
లేదంటే చేతగాని తనమై
భస్మాసుర హస్తమౌతుంది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment