వీరికి పేరేది...పుట్టేవారికి చోటేది -2
తేది: 11-07-2024
శీర్షిక : సమ సమాజం
చెట్టుపేరో గుట్ట పేరో
మట్టి పేరో ...మహిలో లెక్కలేదు
మదిలో మెదిలే మహత్యమో
ఆధ్యాత్మికమై అంతులేక ....
ఒట్టుపెట్టి చెబుతున్నా
ఒక్కడైనా పేరుకొచ్చు భరతునిలా ....
పదులు ఇరవైలైనా
పట్టం పొందు అంబేద్కరులా ....
ముద్దు ముచ్చటలెన్నో జెప్పి
మురిపంగా ఒప్పించే
నయాననో భయాననో బతిమాలి
దేశప్రగతి పేరు జెప్పి ...
దేబిరించి అధికారగణం ....
చాపకింద నీరులా
సన్నాసులు కొంతమంది
కొమ్ముకాసే ఓ వర్గానికి
కోతికి కొబ్బరిచిప్పనిచ్చినట్టు ....
అధిక జనాభా వలన
అడ్డమైన ఇబ్బందులని
తెలిసినా ... పెడచెవిన పెట్టె
పెద్దమనుషులెందరో ....
మూఢనమ్మకాలను మూటగట్టి
ఆధ్యాత్మికతలను అంటుగట్టి
నిరక్షరాస్యతలకు నీరాజనాలతో
పెంచి పోషించే కొంతమంది ....
ఇప్పటికైనా రాజ్యాంగమును
రక్తికట్టించగా ... సమ సమాజ
స్థాపనలకు అంకురములు గావించి
సవ్యదిశన సలహాలివ్వరే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment