Saturday, July 27, 2024

యాత్రా గేయాలు తేది : 01-06-2024 శీర్షిక : అయ్యప్ప యాత్ర ...

 యాత్రా గేయాలు

తేది : 01-06-2024
శీర్షిక : అయ్యప్ప యాత్ర .... 

స్వామియే శరణం విన్నాము 
అయ్యప్ప శరణం అన్నాము 

ఇరుసంధ్యలలో  తలస్నానం 
నలుపు వర్ణపు  వస్త్రములు 
తులసిపూసల మాలలతో 
శరణమెప్పుడూ  చింతనగా ..  

స్వామి పదమే  సదా వేదమై 
సాత్విక భోజ్యం  శిరోధార్యమై...  
వయో భేదములు లేకుండా 
వ్యసనాలకు బహుదూరంగా  ...

స్వామియే శరణం విన్నాము 
అయ్యప్ప శరణం అన్నాము   

మాల వేసుకుని  దీక్ష తీసుకుని 
మండల కాలము ఏకభుక్తము .... 
పూజలు భజనలు పూనకమే 
పుణ్యకార్యములు పుష్కలమే....   

పవిత్రమైన పదునెట్టాంబడి 
పడి పూజలను  దండిగ చేసి .... 
పూలు పండ్లు పలురకములతో  
మండల పూజలు గావిస్తూ .... 

స్వామియే శరణం విన్నాము 
అయ్యప్ప శరణం అన్నాము 

ఇరుముడి చక్కగ కట్టుకుని 
శిరమున మరిమరి ఎత్తుకుని .... 
కన్నె సామిగా కరుణ జూపుమని 
గురుస్వామితో  పయనములే   .... 

ఎరుమేళిలో పెటతుల్లితో 
కన్నెసాములా ఆటాపాటా .... 
పంపా నదిలో స్నానము జేసి 
గంట కొట్టి గణపతికి మొక్కి... 

స్వామియే శరణం విన్నాము 
అయ్యప్ప శరణం అన్నాము   

నిటారుగున్న నీలిమలై ఎక్కి 
అపూర్వమైన అప్పచ్చిమేడు ... 
శరణుఘోషల శరంగుత్తి దాటి 
చేరుటయే  అయ్యప్ప మందిరం .... 

సుందరమైన రూపం కనినా 
మోహనరూపం అయ్యాప్పా అంటూ .... 
పులకరింపులే తనువెల్లా 
మనోల్లాసమే జీవితమంతా .... 

స్వామియే శరణం విన్నాము 
అయ్యప్ప శరణం అన్నాము  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment