రామోజీ రావు
09-06-2024
నిశ్శబ్ద విప్లవం.
చెరుకూరి వారి కన్నబిడ్డ
పెదపారుపూడి ముద్దు బిడ్డ
తెలుగు వారి తొలి పొద్దు
జాతిసేవల తన్మయుడు ....
అభివృద్ధికే అతడొక ఎమోజి ....
చిరునవ్వుల చిన్మయుడు
అనుభవాల నిచ్చెనలే
ఎదుగుదల అడుగులు ...
చేపట్టిన ప్రతి పనిని
చేవకలిగి చూపాడు
నిబద్దతో నడిపించాడు ....
విపత్తుల జాడలలో
విధికెదురీదిన స్పందనలే ...
తమపర భేదమెరుగక
సమాజహితమే అభిమతమని
జాతి కష్టాలకు కరిగి పోయి
భుజమిచ్చిన ధీరుడు ...
బడిగోడలను పలకరించి
గుడులలాగా నిర్మించాడు ...
కష్టపడే తత్వపు చిరునామా
కలిమి సృష్టిలో ప్రజ్ఞుడు ....
పత్రికా రంగంలో పతాకం
మీడియా రంగపు శిఖరం ...
చిట్ ఫండులలో చిరంజీవి
సినీరంగానికి చుక్కాని...
ఫిలిం స్థూడియో నిర్మించి
తెలుగునేలను పులకింప
జేసిన పుణ్యాత్ముడు ...
బుల్లితెరకు దొరబాబు ....
అది ఇది అను తేడాలేదు
పొదుపులు నేర్పి మదుపర్లకు
మార్గదర్శి అయ్యాడు ....
హోటల్ రంగంలో రుచులు
ప్రియమైన భోజన పచ్చళ్ళకు…
వస్త్ర ప్రపంచంలో విహంగమైన
పద్మవిభూషణుడు ....
ఆపదలకెపుడు ఆపన్నహస్తమే…
తాను కదిలేవాడు కదిలించేవాడు
ముందు నడిచే మార్గదర్శకుడు
ప్రగతికి తానొక నిశ్శబ్ద విప్లవం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment