చిత్ర కవిత
02-06-2024
శీర్షిక : ప్రజలు అమరులు
పురుడు పోసిందెవ్వరో గాని
పుట్టుక నుండి పోరాటాలే ....
నాడు కక్షగట్టిన పాలకులపై
నేడు పక్షపాత పాలనలపై ...
తొలి విడత తొంబై ఐదు సార్లు
కాల్పులు జరిపితే 369 మంది
అమరులాయె ... తొలి అమరుడు
శంకర్ తోవ జూపితే ...చాప కింద నీరాయే...
దమ్ము తీసుకుని దశాబ్దం పాటుగా
జరిగిన మలి విడతన పోరులో
పదకొండు వందల శవాలు లేస్తే గాని
ఢిల్లీ పాలకులకు చీమ కుట్టలేదు ....
అర్ద శతాబ్దం తెలంగాణా ఉలిక్కిపడితే గాని
మొద్దు నిద్రలేవని మొరటు పాలకులు....
కొట్లాడి పోట్లాడి తెచ్చుకున్నది ప్రజలైనా
ఇచ్చుకున్నది మేమంటే మేమంటారు ....
కట్టేది శ్వేతవస్త్రములైనా కట్టడి లేని
నోటి మాటలతో తిమ్మిని బిమ్మిని చేస్తూ
స్వార్థాలకు తెరలు తీసి చావగొడుతున్నారు
మొసలి కన్నీళ్లతో మోసాలుఇంకెన్నాళ్ళు ....
ప్రజలు పోరి అమరులైతే
పందికొక్కులు కోరి పాలకులైరి ....
ఏ రీతి బాగుపడునో నా తెలంగాణా
ఎదురు చూపులే పూలబాటల
పుణ్య చరితకు పూర్ణ కుంభమై .....
No comments:
Post a Comment