Friday, July 26, 2024

ఫోటో ఫ్రేమ్ తేది 21-05-24 శీర్షిక : అపురూపాల పొట్లం ...

 ఫోటో ఫ్రేమ్

తేది 21-05-24
శీర్షిక : అపురూపాల పొట్లం ... 

ఆధ్యాత్మిక తరంగానికి ఆధారం 
కుటుంబ పెద్దల ఆరాధ్యం 
గొప్ప గొప్ప నేతల జ్ఞాపకం  ... 
దాంపత్యాల దశ దిశలు ..... 

జీవితంలో జరిగే అపురూప
తీపి జ్ఞాపకాలను తీరొక్కరీతిగా
బందించి దొంతరలుగా పేర్చుకుని 
దోబూచులాడే జ్ఞాపకాల పెట్టె… 

బాల్యచేష్టలలోని బలమైన సాక్ష్యం 
మధురక్షణాలను సుందరముగా 
బంధించి మళ్ళీ మళ్ళీ అనుకున్నప్పుడు 
ఆనందాలను మూటను విప్పుకునే పొట్లం ... 

ఉత్సవాలలోని సప్తవర్ణాలను 
ఉన్నత సన్నివేశాలను రంగు 
రంగుల ఫ్రేములలో బంధించి 
రమ్యంగా ఆనందించడానికి ..... 

సరదాగా మొదలై ఆనందాలను 
మూటగట్టిన అలవాటు ... ఈనాడు 
ఉత్సావాలలో ఊరేగుతూ... 
అసలు కొన్న కొసరెక్కువన్నట్టు 
అపవాదును మూటగట్టుకుంటున్నది... 

అతి సర్వత్రా వర్జయేత్ ... అన్నట్టు 
ఏదైనా మోతాదు మించితే  వాంతులే... 
పరిమితిలో పయనించి మళ్ళీ 
పూర్వ వైభవాలను పొందాలని 
ఆశిస్తూ .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment