Saturday, July 27, 2024

కక్కుర్తి తేది : 13-07-2024 శీర్షిక: బ్రాండ్ అంబాసిడర్

 కక్కుర్తి 

తేది : 13-07-2024 
శీర్షిక: బ్రాండ్ అంబాసిడర్ 

చాలామంది రాజకీయనాయకులు  
బ్రాండ్ అంబాసిడర్స్లు ఉన్నారు… 
ప్రజలసొమ్మున ఫలహారంగా మేసే రకం…
కష్టపడకుండానే కాసులకు 
రాశులకు కన్నాలేయడం .... 

ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ 
అయినా సరే తాగేసే రకం ... 
ఏనుగులయినా సరే పీనుగులైనా 
సరే మన ఖజానా చేరాల్సిందే ... 

మీరు మా ఇంటికొచ్చినా సరే 
మేము మీ ఇంటికొచ్చిన సరే 
మాకేంటి తెస్తారు... ఇస్తారు... 
లాభం మాత్రం మాకే దక్కాలనే రకం ... 

నలుగురిలో నడుచుకోవాల్సిన 
మర్యాదలు గిర్యాదలు జాన్తా నహీ 
నా తోవ నాదే...ఇష్టముంటే 
ఒప్పుకో  లేదంటే తప్పుకో అనే రకం .... 

గాలికి పోయే కంపయినా సరే 
నా ఇల్లే నింపాలి ... అవసరమా 
అనవసరమా మీమాంసల జోలీ 
అక్కరలేని అదో మాలోకం రకం .... 

పక్కోని సంసారం నా సంసారంలో 
కలిసిపోవాలి ... నాదే హుకూం ... 
దుష్టచతుష్టయాన్ని మించిన 
దుర్గుణ బహురూప దుశ్శాసన రకం ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment