Sunday, July 30, 2017

THIS IS THE NTPC LTD

  THIS IS THE NTPC LTD

    

పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరాన - 

నవంబరేడవ తేదీన -ఉధ్బవించిన ఎన్ టి పి సి


50000 మేఘా వాట్ల ఉత్పత్తులతో - 

నలుబది ఒక్కేళ్ల మహోత్సవం జరుపుకుంటున్నది


భారతాన ఆనాడు వెలుగుల సంస్థగా వచ్చినది 

వేల మంది ఉద్యోగులతో, మేఘా వాట్ల ఉత్పత్తులతో 

దశ  దిశల దేశాన జాబిలి వెలుగులు నింపినది 

విఫణి వీధిలో మహారత్నమై కలికి తురాయిగ  నిలిచినది 


పరిశుభ్ర తలను ఆచరిస్తూ, పర్యావరణం పదిలపరుస్తూ   

స్పష్టమైన దృక్పథంతో, సుసాధ్యమైన లక్ష్యాలతో 

నవ్య సాంకేతికతను స్వాగతిస్తూ, నాణ్యత కేమో పట్టం కట్టినది

మౌలిక విలువలు పాటిస్తూ మానవతను చాటుచున్నది


థర్మల్ పవరుతో మొదలెట్టినా - 

హైడల్ పవరును అక్కున చేర్చుకుని 

గాలి మరలు మొదలుకుని, సోలారును అందుకుని - 

ఆటమిక్ లో సైతం అడుగిడినది 


ముందు వెనుక నేనేనంటూ -

కోల్ వాషరీస్ , ఫ్లై  యాష్ లలోనే కాకుండా 

రైల్వే లతో పొత్తు కుదుర్చుకుని -పవర్ సేలు , 

సలహాల సర్వీసులలో  సై అంటున్నది                                
                   

సంఘ హితం సదా కోరే సంస్థగా - 

సడక్ లుపల్లె  చదువుల్లో ప్రశిక్షణలే  కాకుండా

స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో సైతం - 

సంఘీ భావంతో పాలు పంచుకున్నది

  

విఫణిలో సంస్థలన్నీ కుదేలయ్యి రోదిస్తున్న సమయము లో
  
తబ్బిబ్బులకు తావివ్వకుండా తమాయించుకుని నిలిచినది

  
ఆర్ధిక మాంద్యములోను అతలాకుతలం కాకుండా

 కొండంత అండనిచ్చి నిలిచినది  మనకు, మన వాటా దారులకు

 
 పంట  పొలాలకు, పరిశ్రమల అవసరాలకు-

 ప్రతి క్షణం అండ దండగా నిలుస్తున్నది

 నాటి నిపుణుల స్వప్న సాకారంగా - 

సంస్థ సారూప్యత చెంది నిలిచినా

                   
 నేడు, మేటి నిపుణుల సమాహారమై -

  ప్రగతి మార్గమున పయనిస్తున్నది

   
పట్టాలు పుచుకుని పరుగున వచ్చిన మనకు - 

పదే  పదే ప్రశిక్షణలిచ్చి - పరిణతి నింపి నిలిపినది అమ్మలా
   

కన్న తల్లి తండ్రులను - కట్టుకున్న ఇల్లాలును - 

కని పెంచిన పిల్లలను - సదా కని పెట్టుకుని ఉన్నది


అత్యవసరాలకు ఆదుకుని - అవసరాలన్నీ తీర్చినది

చదువులిచ్చి పిల్లలకు - సంస్కారములు నేర్పింది   
పండగలకుఫర్నీచర్లకు - వాహనాలకు , ఇళ్లకు , 

కంప్యూటర్లకు బహు చక్కగా అడ్వాన్సులు  ఇచ్చి  - 

బ్రతుకంతా బాధ లేకుండా  ఇంటి వాన్ని చేసింది

 గేటెడ్ కమ్యూనిటీలో - సెక్యూర్డ్ జీవితాలనిచ్చి

  సంఘములో స్టేటసిచ్చి – సంతృప్తిని ఇచ్చింది

  సాదాగా వచ్చిన మనందరిని - సంపూర్ణముగా తీర్చి దిద్దినది

  అంతరాత్మను సృశించి - అంతర్ముఖుడవై గమనించు మిత్రమా

                    
  అవార్డులెన్నో గెలిచినది , రివార్డులెన్నో తెచ్చినది    
                 
  రికార్డులెన్నో అధిగమిస్తూ జాతి కీర్తిని ఇనుమడిస్తూ

                   
   విశ్వ వేదికలలో,  వినీలాకాశంలో తారగ  నిలిచినది
  
   కళ్ళు మిరుమిట్లు గొలిపే  కాంతి పుంజము మాదిరి -కర్మాగారమై వెలిసినా,

   మనందరికీ మాతృ మూర్తి సమానమైన-పవిత్ర దేవాలయం మిత్రమా

Friday, July 14, 2017

అవినీతి, లంచగొండి తనం

అవినీతి,లంచగొండి తనం అంటరానిదే

అయినా చాలామంది అదే జీవితముగా భావిస్తారు  

అత్యంత మూర్ఖమైనది,నీచమైనది

కొంత మంది ప్రాణాలను కూడా బలి  తీసుకుంటుంది

అందరికి హేయమైనదే -  అయినా కొందరు అక్కున చేర్చుకుంటారు
చాలామంది ఛీత్కరిస్తూనే ఉంటారు - అయినా నిత్య నూతన దారుల్లో వస్తుంటుంది

పిల్లలమఱ్ఱి మానులా - విశ్వమంతా విస్తరించినది

అశ్వత్థ వృక్షంలా - అతి నిటారు, లోతైనది

తేనె పూసిన కత్తి లాంటిది - ఎవరి ప్రాణం ఎప్పుడు తీస్తుందో

టెర్రరిస్టులకన్నా ప్రమాదకరమైనది - యుద్ధం కన్నాఎక్కువ ముప్పు కలిగించేది.

ఎదుటి వారి విషయాలు విన్నప్పుడు

ప్రతీ వారికి  రక్తం మరుగుతుంది

ఎదురు పడితే - ఏదైనా చేసేయాలన్నంత 

కోపం నషాళానికి అంటుతోంది

యథా రాజా తథా ప్రజా అన్నట్టు

చాలామంది ప్రజా నాయకులు,పాలకులు,

అధికారులు,ఉద్యోగులు, కాంట్రాక్టర్లు,

ఇంజినీర్లు,గణకులు,న్యాయవాదులు, డాక్టర్లు ,వ్యాపారులు

వారిని చూసి వీరు -వీరిని చూసి వారు

ఎవరో కొందరు తప్ప- అందరూ అదే తంతు

పదులు, వందల  రూపాయల కొరకు -

ప్రాణాలను కూడా ఖాతరు చెయ్యడం లేదు

పచ్చ కాగితాల ముందు మానవత్వం మంట కలుస్తున్నది -

మనిషన్నవాడు మాయమౌతున్నాడు "మనీ" షి  మాత్రమే మిగులుతున్నడు

కుండెడు  తేనెలో ఒక్క నీటి చుక్క వేసిన చందంగా
సంఘమంతా కుళ్ళి కృశించి - కంపు కొడుతుంటే

ఎవరో ఒకరు ప్రయత్నిస్తే  ఏమి మొదలవుతుంది

ఏటిలో పిసికిన చింతపండు వలె - ఎందుకు కోర గాకుండా పోతున్నది

అవినీతి, లంచగొండి తనం, కల్తీ, పర్యావరణ పరిరక్షణ

అన్నీ ఎదుటివారి కొరకనుకుంటారు  - అందరు

భూంరాంగ్ లాగా తమను కూడా మింగుతుందనుకోరు

తమ దాకా వచ్చే సరికి - లబో దిబో మని రోదిస్తారు

ఇచ్చేవారు - పుచ్చుకునే వారు ఇద్దరు నేరస్తులే అయినా

తెలియని మూడో మనిషి కూడా బలవుతాడు కొన్నిసార్లు

"భూంచేసారు లో  కొంత  మంది అమాయకులు కూడా బాలి కావొచ్చు

ఎవరో వస్తారని , ఎదో చేస్తారని కాకుండా

నిగ్రహించి పాటిస్తే - నీతి నియమాలు

ఎదుటివారి వద్ద నుండి కూడా అవే ఆశించవచ్చు
“మంచి తనం”  మనతోనే మొదలు పెడదాము

అవినీతి,లంచగొండి తనం అంతానికి ప్రయత్నిద్దాం

సైనికుడా వందనం


సైనికుడా  వందనం - సంరక్షకుడా వందనం 
అపూర్వం నీ ఉద్యో  ధర్మం - అనిర్వచనీయం నీ త్యా ఫలం 
కన్న  తల్లి తండ్రులకు - కట్టుకున్న ఇల్లాలుకు 
కని పెంచే పిల్లలకు - కడు దూరం నీ నివాసం 

కొండ కోనలలో - వాగు వంకలలో 
చిన్న చిన్న డేరాలతో - కదలాడే నీ ఆవాసం 
సరిహద్దుల్లో పగలు రాత్రి - ఎండా వాన ఎల్లెడలా
సున్నా డిగ్రీ  సెంటి గ్రేడైన - ఆగని నీ పహారాతో

ప్రజా సంక్షేమమే - పండుగలు పబ్బాలు 
దేశ శ్రేయస్సే నీకు - ఉచ్వాస నిచ్వాస  
కోటాను కోట్ల దేశ ప్రజలు - నిబ్బరంగా నిలవడానికి 
ఆటు పోట్లను తట్టుకుని - ఆదమరిచి నిదరోవడానికి 

అగ్ని ప్రమాదాలు  - వరద భీభత్సాలు - వెల్లువెత్తినప్పుడు
అత్యవసర పరిస్థితులు  - పదలు  సంభవించినప్పుడు
ఆదుకోవడం లో నీవు చూపే చొరవ - అనిర్వచనీయం అత్మీయుడా  
సదా బాధ్యతలు నిర్వర్తిస్తూ - సంయమనం పాటిస్తూంటే 
సాక్షర సన్మానం తో - సెల్యూట్  చేస్తా సో దరా