Friday, July 26, 2024

లలిత గీతం తేది : 25-05-2024 శీర్షిక : నర్మదమ్మ

 జలగీతాలు 

తేది : 25-05-2024
శీర్షిక : నర్మదమ్మ 

నందనమే నర్మదమ్మ 
తన్మయమ్ము  పొందుదాం ... 

క్రోధినామ వత్సరములో 
నర్మదమ్మకు పుష్కరోత్సవం
పుట్టు పూర్వోత్తరం  తెలిసికొని  
పునీతులము  అవుదామా ....  

అమరకంఠక్ లో పుట్టినది  
అనువుగా ప్రవహించుచు   ... 
పడమటికి  పయనమాయె  
నర్మదగా పేరుపొందె  .... 

నందనమే నర్మదమ్మ 
తన్మయమ్ము  పొందుదాం ... 

అమరకంటక ఓంకారేశ్వర్లతో  
ఆధ్యాత్మిక తరంగమును ... 
అవలీలగ ఒడిసిపట్టి 
అలరారినది పుణ్యతీర్థములై ....  

బడెఘాట్ పాలరాతి కొండలే 
నదీమ తల్లికి పట్టుపరుపులవ్వగా 
కొండలలో పడిలేస్తూ ఉరకలేసె 
అందమైన జలపాతములుగ  ... 

నందనమే నర్మదమ్మ 
తన్మయమ్ము  పొందుదాం ... 

సాత్పూరా శ్రేణులలో
వింధ్య పర్వతాల గుండా  ... 
మధ్యప్రదేశ్ మహారాష్ట్ర 
సౌరాష్ట్రా  ప్రజలకొరకు ..... 

కుడి ఎడమల వైపులలో 
ఉపనదులను కలుపుకుంటూ ... 
కులాసాగా పయనించెను  
ఖంబట్ సంధి చేరుకొనగా .... 
(అరేబియా మహాసంద్రం ) 

నందనమే నర్మదమ్మ 
తన్మయమ్ము  పొందుదాం ... 

(నర్మదమ్మను స్మరించుదాం )
తన్మయమ్మును  పొందుదాం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment