Saturday, July 27, 2024

అంశం : మౌనం హైకూలు 27-06-24

 అంశం : మౌనం 

 హైకూలు 
 27-06-24 

 1.మౌనము కూడా 
 మర్మపు ఆయుధమే 
కొన్ని వేళల్లో…

 2. పెద్దల మాట 
 సద్దిమూట చేసుకో 
మౌనము లాగా… 

 3.ఎద సవ్వడి 
నువు వినాలనుంటే
మౌన గీతమే… 

4. మౌనంలో కూడ 
మరో భాష దొరుకు
మరి యత్నించు… 

5. చెప్పుకోలేని
చేంతాడంత కథకు
మౌనం జవాబు… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment