Thursday, July 25, 2024

ఫలితం తేది : 30-04-24 శీర్షిక : కర్త కర్మ క్రియ అంతా తానేనన్నాడు..

 ఫలితం 

తేది : 30-04-24
శీర్షిక : కర్త కర్మ క్రియ అంతా తానేనన్నాడు.. 

కష్టే ఫలీ అనుభజ్ఞుల మాటైనా 
 కల్మషమెరుగని కర్మలాచరించుటే 
 కర్తవ్య పాలనని భగవంతుడు 
 నుడివిన వేదవాక్కులు ...

 అంతా నేనే అనుకోవడం 
 అహంభావ సంకేతం... 
 కర్త కర్మ క్రియ అంతా తానేనని 
 ఏనాడో తెలిపెను భగవద్గీతలో ... 

గాలిలో దీపంలా కాకుండా 
 నీ కర్మ జ్యోతులను 
 గర్భగుడిలో దీపంలా వెలిగించు 
 ఫలితమదే ప్రాప్తించు.. ...

పరీక్షలవే అయినా 
 మనిషి మనిషికి మారుతుంది.. 
 పరిస్థితుల ప్రభావం 
 ఫలితాల ప్రాప్తం ...

ఉద్దండ శాస్త్రజ్ఞులైనా సరే
శాస్త్రసాంకేతికతలు అంత్యములో
ఆధ్యాత్మికత ఆరంభమనే మాటను
మనమంతా గమనించవచ్చు .. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment