మే డే
తేది: 01-05-2024
శీర్షిక : అమాయకత్వమే…
ఉత్పత్తులకు మూలమైనా
ఉత్తుత్తి గౌరవాల మూటలే…
కోట గోడలకు రాళ్ళెత్తినా
పూటలకు ఎదురుచూసుడే..
పారిశ్రామిక ప్రగతికి
నిచ్చెన
మెట్లయినా ..
పట్టుమని
పిడికెడు
మెతుకులకు
మొహం వాచే వార్తలు...
సాంకేతికతలో సత్తా చాటినా
జీవన వ్యయాల పట్టిక సరితూగని
చాలీ చాలని జీతాలతో
చాలెంజిల బ్రతుకులే ...
పెరుగు చిలికిన వెన్నలా
రుధిరం స్వేదమైతేనే ...
కొలిమిలో కాల్చిన కర్రులా
కండరాలు కరిగిస్తేనే ...
సంపదలకు మూలమైన
సర్వాంతర్యామి శ్రమశక్తి ....
అయినా ... ఆకలి రాక్షసికింకా
బలౌతున్న అమాయకమే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment