కొంత మంచినీ పోగేసుకుందాం
తేది 30-04-2024.
శీర్షిక : నడుం బిగించండి…
ప్రకృతి ప్రసవంలో పురుడోసుకున్నాక
జీవరాశి పవిత్రతలను మూటగట్టుకోక
కలిమాయల స్వార్థాల సంచులు
తగిలించుకుని దేబిరిస్తున్నాము ...
ఋషిపుంగవులు మునులు దివ్యమై
బోధించిన పురాణేతిహాసాలను
పట్టించుకోక..రజోగుణ సంపత్తికే తాళం
వేస్తూ తానా తందానా అని గంతులేస్తున్నాము ...
కొంతమంది అనుభవసారాలను
చరితల్లో చదివికూడా ...చలన
శీలతలను
కోల్పోయి..సోయి తప్పి
సోంబేరులమై
పశు తమకంలో తచ్చాడుతున్నాము...
వివేక విచక్షణల వింత పంజరాన్నని
విరించి రాగాలతో రంజిల్లుదామని
ఆశ ..
కానీ ఆత్మీయతల పొరలు
చిరిగిపోతున్నా
అతికించుకున్న ఆనవాళ్ళేవి..
కాల మార్పుల యవనికలో… అనురాగాల
తోటలో విహరించి..ఆప్యాయతల మలాములు
రాసుకుని..అనుబంధాల మూటలు నెత్తికెత్తుకోని
అప్పుడప్పుడు కొంత మంచిని కూడా
మూటకట్టుకుందాం.. నడుం బిగిచండి ..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment