Thursday, July 25, 2024

నిత్య వసంతం తేది: 06-05-2024 శీర్షిక : అపురూప కానుకలే

 నిత్య వసంతం

తేది: 06-05-2024
శీర్షిక : అపురూప కానుకలే

శిశిరంలో  మోడువారిన తరువులకు  
వసంతంలో  చిగురించు తనువులు...  
సప్తవర్ణశోభితమే సంభ్రమాశ్చర్యచకితమే 
ప్రకృతి సరాగాల సలలితమే సంపంగి పరిమళమే .... .. 

చిక్కులమయ జీవన గమనంలో 
చింతలతో నిండా మునిగిపోయినా... 
అప్పుడొప్పుడొచ్చే అపురూప కానుకలే 
నిరంతరం  వాడని జ్ఞాపకాల మధురిమలు ... 

విరామమెరుగని వింతల సంతైన
కాలచక్రంలో... నిత్యం వైవిధ్యతల 
వసంతాల సంతోషాలను వేటగాడిలా 
జాడదీసి వెదికి వెదికి పట్టుకోవడమే... 

కోరుకోని శిశిరమైనా సరే ... కోరి 
పలకరించినా ...రాబోయే వసంతంతో 
రంజిల్లవచ్చనే  ఆశలపల్లకే మనందరి
జీవన గమనం… 


No comments:

Post a Comment