Thursday, July 25, 2024

మధుర గేయాలు తేది : 30-03-2024

 మధుర గేయాలు 

తేది : 30-03-2024
శీర్షిక : 

పుట్టినూరు పుణ్యభూమి 
మట్టితాకినా మననమౌను 
రంగురంగుల నెమలీకలు 
రంది మరిచే రమ్యములే .... 

పట్టువస్త్రపు పొట్లములో 
చుట్టుకున్న ప్రబంధకావ్యం 
విప్పుకున్నాకొద్దీ ముల్లె 
మనసునిండా  మురిపాలే ..... 

తోడుకున్నాకొద్దీ తోరమే 
వాడుకునే కమ్మని చెలిమె నీరు 
చెప్పుకున్నాకొద్దీ చెమ్మనే 
కంటనీరుప్పొంగి కరిగిపోవు 

ఊరువాడంతా ఒక్కటయ్యి 
సుట్టుముట్టుదురు సుట్టాలోలె 
చెట్టునలుముకున్న పిట్టలోలె 
చేరిపోదురు చిన్నికష్టమైనా ....

రక్తసంబంధం కాకున్నా 
రక్తి కట్టు వావి వరుసలతో 
బంధమెరుగని బంధుత్వాలతో  
బాధలన్నీ ఇక బలాదూరే .... 

మా ఊరంతా పండగనే 
దారంతా శోభాయమానం 
సీతా రాముల కళ్యాణం 
వైశాఖ పౌర్ణమి పర్వదినం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment