Thursday, July 25, 2024

నేల రాలుతున్న పూలు తేదీ 29-03-2024 శీర్షిక : పెదవి విప్పలేని పేదరికం

 నేల రాలుతున్న పూలు

తేదీ 29-03-2024
శీర్షిక : పెదవి విప్పలేని పేదరికం 

ఆశ ఉంటేనే మనిషంటారు 
అత్యాశల రంగుల కలల్లో ఊరేగుతూ 
ఆశయాల పందిళ్లను కూలగొడుతూ 
పేరాశల పల్లకీలు మోస్తే ఎలా ? 

కంటికి కాన రాని క్రిమి తాండవంలో 
మింటికెగిసే విధమైన సేవలందిచిన 
ధవళవస్త్రాల సైన్యం...కాసుల కమీషన్లకు 
బోసి నవ్వులన్నీ మాయం చేస్తున్నాయి .... 

వైద్యరంగమంతా వంతలు పాడుతూ 
మందులసంస్థల పలుకుబడుల 
బడిలో ఓనమాలు దిద్దుతుంటే ...చేసిన 
ప్రజాసేవల ప్రతిజ్ఞలన్నీ  గాలికి ధూలే .... 

ఎవరికీ పట్టని ఎట్టి బిడ్డలాగా 
ప్రభుత్వ వైద్య సేవలు చోద్యాలను  
చూస్తుంటే...ప్రజలంతా కార్పొరేట్ 
కనుసన్నల్లో స్వేదం ధారపోస్తున్నారు. 

పెదవి విప్పలేని పేదరికము శాపములై  
నేల రాలి పోతుంటే...సాటి మనుషులన్న 
సానుభూతి లేని పెట్టుబడిదారీ పెద్ద సంస్థలు ...
బాధ్యత తీసుకోలేని ప్రభుత్వసేవలు  ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment