చిత్ర కవిత
(చంద్రయాన్ -3 పాద ముద్రలు)
తేది: 28-08-2023
శీర్షిక : ప్రజ్ఞా పాటవం
సహస్రాధికం.
సరిలేరు నాకెవ్వరంటూ
సతీష్ ధావన్ కేంద్రంగా నింగికెగిసె…
సరికొత్త చంద్రయాన్ -3 గా
సై అంటు ఎల్ వి ఎమ్ ఎమ్ 4 వాహకంగా…
నాటినుండి పంచాంగ రచనలతో
ఖగోళంపై నేటి వరకు పెద్దన్న పాత్రనే…
ఖగోళంపై నేటి వరకు పెద్దన్న పాత్రనే…
పేరు నిలుపుకుంటూ దక్షిణద్రువంపై కాలిడి..
బాధ్యతలను బలోపేతం చేసుకున్న భారతావని…
పాలసంద్రంలో పల్లవించానని
ముక్కంటిని శశిధరుని గావించానని
నెలరాజును నేనేనంటు భీష్మించుకుని
రా రమ్మన్న చందమామ రాకపోతే మాత్రం…
అమ్మమ్మ ఇంటికి పోలేమా మనం…
కొండాకోనల్లో తచ్చాడుతున్నాడని
కోటనే అక్కడకు పంపించాము ...
వింతలతో విందు చేయు ఖగోళంనుండి
కోరిన కోటి పూలు తేలేకపోయినా
విరితోటల పరిమళాల ఘుమఘుమలే ...
బండేసుకుని తాను రాలేకపోయినా
రాకెట్టేసుకుని రయ్యిమన్నాను…
సంద్రపు అలలవోలె పడిలేస్తూ
బంతిపూలు కోసుకు రాలేకపోయినా..
పరుగెత్తే సత్తా ఉందని నిరూపణగా
పొరుగుల పలుకుల ములుకులకు పగ్గంవేస్తూ
ఫలితం సాధించి సత్తాచాటారు.
పెదవి విరచిన విశ్వం ముందు..
జూలు విదిల్చిన సింహమై
పెను సవాలును విసిరింది….
మూడింట నెగ్గినది…ముచ్చటగా నిలిచింది…
మురిపంగా లాండింగు చేసి… మూలకాల
జాడలు కనుగొనడానికై …ముజ్జగాలకు తాను
చాటింది “ప్రజ్ఞా” పాటవాల ముద్రలతో…
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment