Sunday, July 14, 2024

తూర్పు సింధూర దర్శనం తేది : 16-08-2023 శీర్షిక : పల్లెలో పొరుగిల్లు

 తూర్పు సింధూర దర్శనం 

తేది : 16-08-2023
శీర్షిక : పల్లెలో పొరుగిల్లు 

సుషుప్త సమాప్తపు సంకేతం 
సప్తవర్ణాల అంబర సుందర చిత్రం 
శుకపికముల కిలకిలా రవములతో
సరిగమలొలికించే భూపాళరాగం 
సరిలేరు నాకెవరూ అంటూ భానోదయం…

పల్లె జీవితంలో పొరుగిల్లులా 
ఇంటికి ముందునుండైనా  
వెనకనుండైనా… పొలం పనులలో
నిత్యం చూడగలిగే నిజరూప దర్శన  భాగ్యం  ... 

సంస్కృతి సంప్రదాయాలలో 
ఆచార వ్యవహారాలలో అగ్రభాగం 
అందుకే మరి... రైతయినా... రాజైనా 
ఉదయాత్పూర్వమే మేల్కొవాలని ... 

ఉత్సాహాలతో ఉరకలేయు ఉల్లము
ప్రతిపనిలో పవిత్రతలు నింపుకుని…
కొనలేని ఆరోగ్యాలకు మూలం 
కొండంత సమయాలకు నిలయం .... 

పట్నాలలో  ఆవాసం 
పంజరాలలో నివాసం …
కాంక్రీటు జంగళ్లలో ఎటు చూసినా 
కానరాదు చూడలేము .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment