అభ్యుదయ గేయాలు
తేది : 29-07-2022
శీర్షిక : మానవత మరలిరాదా ...
కవిత సంఖ్య : 949
జీవరాశి చరితలో
మానవాళి మిన్నరా
స్వాతంత్య్రం వచ్చింది
సంబరాలు తెచ్చింది
స్వార్థాలు మాయలేదు
సంకుచితం వదల్లేదు ...
పార్లమెంటు ప్రాంగణం
పాలకులతో కిటకిటలే
పనికిరాని లెక్కలేవో
పల్లెదాకా చేరపాయె ..... // జీవ //
త్రివర్ణ పతాకాలు
రెపరెపలు ఆకసాన
తిండి తిప్పళ్లకింక
తెల్ల రేషన్ కార్డులే
లక్షలు కోట్లల్లో
లగాయించి బడ్జెట్టులు
అయినా లక్ష్యం చేరని
అరకొరల గమ్యాలు // జీవ //
షెడ్యూళ్లలో రాజ్యాంగం
సేదలు దీరుతున్నది
వడ్డీలకు బెదిరింపులు
లక్ష్యంగా అమాత్యులే .....
లెక్కకు మించిన చట్టాలు
చక్కబెట్టలే ఒక్కటన్నా
ఒంటరిగా మహిళనేడు
ఓటి కుండ తీరు చూడు // జీవ //
నాగరికత మైలురాయి
యాంత్రికత పెరిగింది
బాలలను భిక్షుకులుగ
బలవంతం మానలేదు ...
సాంకేతిక సంబరాలు
చేరుకునే అంబరాలు
బతుకుదెరువు విదేశాల
కటకటలు కన్నోళ్లకు ... // జీవ //
పాలకుడు అధికారి
పక్కాగా సేవ చేస్తే
ఫలితమింక సులువే
ప్రజలవంక పాలనతో ...
ఆత్మీయతలల్లుకుంటే
అనురాగం పెల్లుబుకితే
మానవత మరలిరాదా
మనుషులంతా కలిసిపోరా .... // జీవ //
నగునూరి రాజన్న
No comments:
Post a Comment