చైతన్య గేయాలు
తేది : 01-07-2023
శీర్షిక : చేత సాయం
సహాస్రాదికం
మాట సాయం కట్టిపెట్టు
చేత సాయం అందించు ....
పెద్ద చెట్లను పెడనరికేసి
చిన్న మొక్కతో సెల్ఫీలా ?
జీవరాశిలో మిన్నన్నావు
భావరాశిలో వెనకయ్యావు ....
చేమంతిలా చెంగునవిసిరి
చెత్తతోని కాలువనింపి ....
పొరుగులెవరో వేస్తేనో
పరుగునెళ్లి పోట్లాటలే .. //మాట//
అంటకాగిన ఆనవాళ్లతో
గల్లంతయిన గమ్మత్తులు ....
హొయలొలికే జలపాతాలు
హాయి గొలిపే పచ్చికబయళ్ళు ....
పరిచయించ అక్కరలేని
వింతనిండిన ముంతమామిడి
పాలిథీన్లతో నిండిపోయెను
వాగూవంకలు వనములెల్లను .... //మాట//
పాతంటే రోత కాదు
కొత్తంటే వింతేమి లేదు
పాత కొత్తల కలయికలే
జీవితాన ఉపదేశములు ....
అనుభవాలను రంగరించు
ఆధ్యాత్మికత జోడించుము...
పచ్చ పచ్చని వనము పెంచి
పుచ్చ పువ్వోలె ఫరిఢవిల్లుము ... //మాట//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment