Thursday, July 25, 2024

మనసులు మలినం కానంతకాలం తేది: 27-03-24 శీర్షిక : కడిగిన ముత్యమే

 మనసులు మలినం కానంతకాలం 

తేది: 27-03-24
శీర్షిక :  కడిగిన ముత్యమే

అనురాగాల నిర్వచనం 
అనుబంధాల చిరునామా
తోబుట్టువుల బంధం..కడిగిన ముత్యమే
ఓ ఇంటి వారయ్యేంతవరకు.. 

అన్నకు పొట్టయిన అంగవస్త్రాల 
సాక్షిగా..ఆప్యాయతలు కలబోసుకున్న 
ఆనవాళ్లే.. తమ్మున్నెవరైనా 
ఆటపట్టిస్తే తాట తీసిన దాఖలాలే ... 

చేపపిల్లల చూపించి చెరువులో ఈత 
నేర్పించిన ఇగురమే.. గాలిలో చక్కర్లు కొట్టే
గాలిమోటారు చూపించి గమ్మత్తుగా సైకిల్ 
కాంచి తొక్కుడు నేర్పించిన చతురతలే ... 

అక్షరాల తోవలో గురువై చదువు 
సంద్యలలో గుంభనంగా గురుతరమై 
భుజంతట్టి సద్దిముల్లెలా బుద్దిగా 
రాత పనులు నేర్పించి దారివేసిన మార్గదర్శే ... 
 
పెద్దగురువై గుండె ధైర్యం నూరిపోసిన 
గురుతులే ఆటపాటలలో… 
చిక్కు సమస్యల జీవనయానంలో
అడుగడుగున సుద్దులెన్నో నేర్పించిన
నేర్పరే అన్నంటే... అన్నీ అమృతతుల్యాలే… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment