29-02-2024
అంశం : పల్లె దారులను పలకరిద్దాం ..
శీర్షిక : అప్పుడప్పుడు
చుట్టూ పచ్చని పొలాలు
చూడ చక్కని పళ్ళ తోటలు...
మరకత శోభలతో వెలిగిపోతూ
చూపరుల మనసుకు గాలమే ...
కల్లబొల్లి మాటలు రాని
కపటమెరుగని కబోదులు... మాయ బజారు జూటాలు
కసాయి తనమెరుగని తత్వాలు ....
పిల్లలు పెద్దలు ప్రేమలో మునిగి
ఆత్మీయతలు అంటుగట్టుకున్నోళ్ళే....
ఎవరి పలుకులైనా ఎంత మధురమో
అనురాగాల వల్లరి ఎటు చూసినా ....
కలుషితాలెరుగని గాలి సుగంధం ...
కాలుష్యమెరుగని నీటి సెలయేళ్ళు ...
కలువ భామల కాంతి రేఖలు
చెరువులన్నీ తంగెళ్ల చెలిమెలు ....
పల్లెలంటే మరువ దమనాల
పరిమళాల సుగంధాలు ....
అంతా బంధు మిత్రుల బలగాలే
పిలుపుల్లో తేనె మధురిమలే ....నాడు
అయినా ఇప్పటికీ అప్పుడప్పుడు
మరకలెరుగని మల్లె పరిమళాల
గుబాళింపులూదే అచ్చమైన పల్లె తల్లి
జాడలు వెదుక్కుంటూ వెళ్ళొచ్చెయ్యాలి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment