ఆశను వాగ్దానం చేద్దాం ....
తేది : 01-03-2024
శీర్షిక : ఎదురును చూస్తున్నా ...
యుగ ధర్మమనుకుంటా ...
జగమెరిగిన సత్యంలా
చిల్లర మల్లర చిలిపి చేష్టల
అసువులు తీసుకునే దశలు…
అయ్యా పాలించండని పట్టం
కడుతున్న పాపానికి పందుం
మేసి పదో పరకో దులిపి ప్రజా
జీవితాలతో పరాచికాల నాటకరక్తి…
పర తమ బేధమెరుగక పట్టెడన్నం
పెట్టే రైతన్నకు అష్టకష్టాలు వచ్చినా
చూసి చూడనట్టుండే రాజ్యంలో
అన్నీ హెచ్చులకిచ్చే ఉచితాలే ....
ఇక జన్నెకిడిసిన అధికారగణాలు
కుర్చీలో కూర్చున్నా లేచినా కప్పం
కిస్తీలు కట్టమని జన సామాన్యులకు
జుర్మానాల వేదనలు విధిస్తుంటే ....
సింహం లాంటి కొందరిని చూసి
ధవళ వస్త్రదారులు ఇకనైనా
తప్పక వాగ్దానం చేస్తారనే
ఆశతో కళ్ళల్లో వత్తులేసుకుని
ఎదురుచూస్తున్నా .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment