Wednesday, July 3, 2024

హద్దుంటే ముద్దు తేది : 27-02-2024 శీర్షిక : అతి సర్వత్ర వర్జయేత్.

 హద్దుంటే ముద్దు 

తేది : 27-02-2024
శీర్షిక : అతి సర్వత్ర వర్జయేత్.  

క్రమశిక్షణాల కలికితురాయిలా 
సుద్దులు చెప్పలేని ముద్దుల  
మాటరాని పక్షులైనా మాలలా 
కదులుతాయి ఆకాశంలో .... 
సుశిక్షితమై .... 

ఆశలు అత్యాశలు పేరాశలు
లేని జంతుజాలమేమో ... 
ఆకలికి మాత్రమే వేటాడే 
రేపటి కొరకాశించని ప్రాణి .... 

ఆలోచనల మేటినని ... 
విజ్ఞాన వివేకాల పుట్టనని 
జీవరాశిలో మిన్నని విర్రవీగే 
మనిషి మాత్రం ... స్వార్థమెరుగని 
ప్రకృతిని మరిచి ...వికృతమైన 
చేష్టలతో సాలెగూటిలో చిక్కిన 
శలభమై త్రిశంకు స్వర్గములో 
వెంపర్లాడుతున్నాడు .... 

అతి సర్వత్ర వర్జయేత్ లా ..... 
పరిధులు దాటి పటాటోపాలు 
వెలగబెడుతూ .... పక్కవారి 
స్వేచ్ఛలో దూరిపోవడం .... 
గిల్లి కజ్జాలకు జారీ పోవడం .... 
ఇవ్వడమే తెలిసిన ప్రకృతిలో 
పుట్టి పెరిగినా ...తీసుకోవడమే 
దోచుకోవడమే చేస్తున్నాడు ..... 

గీత బోధనల సారాంశాన్ని  .... 
తనువు మనసు తమకమై 
పాటించిన రోజు ...మానవాళికి 
కాదు జీవరాశికే సర్వోన్నతమైన క్షణం ...... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment