చతురత
తేది 28-11-2023
శీర్షిక - సానబెట్టిన సాధన…
ఎంత చెట్టుకు అంత గాలిలా
ప్రకృతి పాఠశాలలో జీవరాశికి
అవసరార్థం అబ్బినదే…
పశుపక్షాదులకైనా...మనుషులకైనా …
సానబెట్టి సాధించుకుంటే చరిత్రే…
కపటవేటగాని వలలోనుండి
అనుభవాలతోటలో అందిపుచ్చుకున్న
సలహాలతో…కంటిలో దుమ్ముకొట్టి
కదిలిపోయిన కపోత సమూహంలా…
మూర్ఖ మృగరాజుకు పాడుబడిన
బావిని చూపి పకడ్బందీగా…
పంచతంత్రంలో పదిలమై
చెంగున దూకిన చెవులపిల్లిలా…
అందుకే.. అందరిలో కొందరే
ఆమోదితం నాడైనా..నేడైనా..
అనుకున్నది సాధించడంలో దిట్ట
చతురతల చాణిక్యుడిలా…
అవాంతరాలను అవలీలగా
అధిగమించే తెనాలి రామకృష్ణుడిలా … ఎక్కడ తగ్గాలో తెలిసి… ఎక్కడ నెగ్గాలో
తెలిసిన మరాఠ మహరాజు వీరశివాజీలా…
కపట చతురతలు కూడా కనపడతాయి
కలికాలంలో…మర్మం తెలిసి మసులుకునే
రాజకీయనాయకులలా… వాతలు పెట్టి…
అయ్యో పాపం అనగలిగే అసలు సిసలైన
వానర వారసులు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment