Sunday, July 14, 2024

చిత్ర కవిత తేది : 11-03-2024 శీర్షిక : బలమైన పునాది రాయి

 చిత్ర కవిత 

తేది : 11-03-2024
శీర్షిక : బలమైన పునాది రాయి

శ్రద్ద చూస్తే ముద్దొస్తుంది
గద్దెలాంటి వృక్షం నీడలో 
వద్దన్నా వదలని తత్వంతో 
నిద్దుర మరచిన చదువరి .... 

అందునా బాలాకుమారుడు 
ఆటపాటల ఆకతాయి కాకుండా 
ఉషోదయపు భాను రశ్మిలో 
పొత్తములో లీనమయిన తీరు .... 

భావి భారతావనికి వన్నెలద్దే 
ఏ యుగపురుషుడు కానున్నాడో ... 
భవ్య చరితను లిఖించే పనిలో 
నిమగ్నమైన స్థితప్రజ్ఞుడు .... 

విజ్ఞానమే వింత ఆభరణమన్న  
సూత్రమెరిగిన మర్మయోగిలా 
మాతంగమునిలా మహానుభావుడై 
చదువులో మునిగిన చరిత్రకారుడు.... 

చరవాణిలో మునగకుండా ... 
భవ్యమైన ఆ తల్లిదండ్రులు 
భావి భారత యువశక్తికిచ్చిన 
బలమైన పునాది రాయి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment