తీయని తలపుల తీరంలో*
తేది : 24-01-23
శీర్షిక : విరి భరిణలే ..
కవిత సంఖ్య : సహస్రాధికం
నడిచొచ్చిన బాటలో నవరత్నాలు
ఏరుకోవడం ... ఎవరికి మాత్రం
ఇష్టముండదు.... అందరు ఆ అదను
కొరుకు కాచుకుని ఎదురుచూసుడే....
పట్టు తేనెలాంటి జ్ఞాపకాల పుట్ట
దొంతర అప్పుడప్పుడు కదిలిస్తేనే ....
జీవన మాధుర్యం చిలుకుకుని
జిహ్వ రుచులమయం అయ్యేది ....
అమృతమూర్తి అమ్మ తో గడిపిన
ఆత్మీయ ఆనందపు క్షణాలయినా ....
నాన్నతో కలిసి నడిచిన బాధ్యతల
అడుగుల అనుబంధాలయినా ....
బాల్యంలో మిత్రులతో పడిన చిటపటల
చిలిపి కిల్లికజ్జాలు ... అపజయపు అంచుల్లో
తచ్చాడుతున్నామంటే కలగాపులగం చేసి
కలగూరగంపను నెత్తికి ఎత్తుకోవడం ...
ఆ తీయని తలపుల తీరంలో
ఎన్నిసార్లు సేద దీరినా ... ప్రతీసారి
ఎదో ఒక కొత్తదనమే.... వింతలు నిండిన
విరి భరిణలే ... వైవిధ్యాల మధురిమలే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment