లలిత గేయాలు
తేది : 05-08-2023
శీర్షిక : కొండమ్మ మెరిసింది.
సహస్రాధికం.
కొండమ్మ మెరిసింది కోనమ్మా మురిసింది
వనమంతా నిగారించి మరకతమై శోభించగ ....
చినుకమ్మ జారగనే తొలకరిగా పలకరించి
పచ్చదనం పరుచుకుని తివాచీని మరిపిస్తే…
కనులకేమో అందాలను కనికట్టుగా చేస్తూనే
అవనంత శోభలతో అలంకృతం అయ్యింది…
// కొండమ్మ //
కువకువలతో పక్షులన్ని గుసగుసలు పెడుతుంటే
కుహూ కుహూ కోయిలమ్మలు రాగమెత్తుకోగానే
వీనులకు విందులై..మనసంతా డోలికలై ..
మరో కొత్త ప్రపంచమే ఆవిష్కృతమౌతున్నది ….
//కొండమ్మ//
శ్రావణ మేఘాలలో రవి శశిలు తచ్చాడుతుంటె
మనసంతా తేలిఆడి మరిచి మురిసిపోతుంది…
నీలి నిలి మబ్బులన్నీ దోబూచులాడగనే
నింగి నేల కలిసిపోయి బంగారుగ కురిసింది….
//కొండమ్మ//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment