Wednesday, July 3, 2024

కాశ్మీరం తేది : 28-02-2024 శీర్షిక : భారత స్వర్గం

 కాశ్మీరం 

తేది : 28-02-2024
శీర్షిక : భారత స్వర్గం 

ప్రకృతితో సహవాసం 
పరవశించు గుండెలు .... 
చల్లని సమీరాలతో 
ఎల్లరకు ఆనందాలే .... 

హిమనగపు సానువులు 
ఇంపైన పూదోటలు ... 
జలసిరులు సెలయేరులు 
కమనీయపు సొగసులు .... 

మంచుపూల దుప్పట్లు 
మరుపురాని సన్నివేశాలు ... 
పల్లవించే హిమనదములతో 
పరవశించు గుండెలయలు .... 

సప్తవర్ణ శోభితం 
ఇరు సంధ్యారాగములు .... 
దూది పింజముల అలంకరణే 
ఆకాశం నిండా అందంగా ... 

ఎత్తైన సరస్సులు ఎనలేని 
ఆందాలు ... జనరంజకమైన 
నృత్యాలు ... జానపదుల 
జావళీలు ... మైమరిపించే 
మహత్యాలు .... 

గొప్ప పేరున్న మొగల్ ఉద్యానాలు 
ప్రేమూర్తుల పహల్గావ్ లు .... 
గుల్మార్గ్లోని  అందాలు 
గుంభనంగా దోచు మది మదిని .... 

నింగినంటే నీలి సరస్సులు 
కలల ప్రపంచపు కమనీయాలు ... 
అపూర్వమైన కళా ఖండాలు 
భారతమ్మ శిఖలోన మాలలు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment