Wednesday, July 3, 2024

చమట చుక్కల కవాతు తేది : 28-02-2024 శీర్షిక : పక్కోడి పెట్టెల్లో పడకేసింది ...

 చమట చుక్కల కవాతు

తేది : 28-02-2024
శీర్షిక : పక్కోడి పెట్టెల్లో పడకేసింది ... 
సహస్రాధికం 

నిత్యం మట్టినే నమ్ముకుని 
అవని గతుకుల్లో అలితేరుతూ 
బతుకులీడ్చే హాలికుడైనా ...
పరిశ్రమల కొలిమిలలో 
కాలి బొగ్గయ్యే కార్మికుడైనా....  

కార్పొరేట్ కార్యాలయంలో 
పనిని కనిపెట్టుకునే శ్రామికుడైనా ....
సుద్దులెన్నో జెప్పి గద్దెనెక్కే నాయకుల 
చుట్టూ నినదించే కార్యకర్తలైనా .... 

రుధిరం మదించిన స్వేదం కవాతు 
చేస్తేనే ...రూపం వేరున్న ఐదు వేళ్ళు 
ఒకటిగా ముద్ద నోటికందించు  
రుచికరమైన విందు భోజనం ... 

చట్టున్నవారికే చుట్టాలౌతున్న 
చట్టాలున్నంతవరకు ....ధన 
దాహపు స్వార్థ సరంగుల దాకా 
వందిమాగదుల రాజకీయ ప్రమేయం 
ఉన్నంత వరకు .... వెట్టి చాకిరీలసమమే 
అసమతౌల్య వేతన విధానాలు .... 

నోముకున్నోడి ఫలం 
నోచుకున్నవాడిని వరించినట్టు...
శ్రామికుల చమటచుక్కలు  పక్కోడి 
పెత్తందారీ పెట్టెలలో పడకేస్తున్నది... 

ప్రజల నిరక్షరాస్యత
సురాపానం చేస్తుంటే ... 
నాయకుల నిరక్షరాస్యత 
పచ్చలు పొదువుకున్న స్వర్ణాభరణం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment