Wednesday, July 3, 2024

కవన రవళి నానీలు తేది : 27-02-2024

 కవన రవళి   

నానీలు 
తేది : 27-02-2024

త్రేతాయుగం 
దేశాల మధ్యయితే ... 
ద్వాపరమేమో 
కుటుంబం మధ్య ... 

హరిత వనంలో 
చెట్లు నాటారు 
నీరు పోయడం 
మరిచారు. 

మార్పులోనే 
పుట్టి పెరుగుతాం..
మారమంటేనేమో 
చాలకోపం... 

మాటరాని పక్షులు 
మాలాలా కదులు
స్వీయనియంత్రణల 
సిపాయేమో  ... 

ఆశలేని జంతువు 
ఆకలికి మాత్రమే 
వేటాడే.... రేపు 
ఎరుగని ప్రాణి .... 

జీవరాశిలో 
మిన్నంటూ మనిషి 
వివేకం మరిచిన 
వింత పశువు .... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment