దర్పణం సాహిత్య వేదిక
అంశం : వేలి ముద్ర
తేది : 26-03-2024
శీర్షిక : మన ఉనికి ....
నాగరికత నడకలల్లో ఓ అడుగు
మనిషి కదలికలకు మరో మడత
గుర్తింపు సాక్ష్యాలకు గురుతరం
వర్తించు ఆమోదములకు దర్పం ....
శంఖం చక్రం గుడారం ఆకారాలతో
చూడముచ్చటే వేలి ముద్రలు
లెక్కుకు ఇరువది గుర్తింపులకు …
శాస్త్ర సాంకేతికతలో చొరబడి
తీరొక్క వేలుకు రీతోక్క గుర్తుతో
ప్రత్యేకతలు చాటి ...మనిషి ఉనికికి
వలువల విలువలద్దిన మహా కావ్యం ....
ముఖ్యంగా నేర విభాగంలో
తొంబై తొమ్మిది శాతం మేర
ఖచ్చితత్వాలతో సవాలు విసిరి
ఫలితాలు సాధిస్తున్న సాధనం ...
కొన్ని కొన్ని సందర్భాలలో
కొంతమందికి నైతిక మద్దతుగా
జాతక చక్రం తిప్పి జవసత్వాలు
నింపి ఉత్సాహపరిచే ఉపాంగం...
అక్కడ ఇక్కడ అనేదేమి లేదు
అన్ని రకాల గుర్తింపుల్లో ... ముఖ్యంగా
ఆధార్ గుర్తింపుల్లో అతిముఖ్యమై
దేశమంతా విస్తరించి నాయకిగా మారింది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment