Saturday, July 13, 2024

శాస్త్రీయ గేయాలు తేది : 27-03-2021 శీర్షిక :ఓ మనిషి తిరిగి చూడు

 శాస్త్రీయ గేయాలు

తేది : 27-03-2021
శీర్షిక :ఓ మనిషి  తిరిగి చూడు
కవిత సంఖ్య  629

ఓ మనిషి  తిరిగి చూడు
ఒక్క క్షణం విలువ తెలిసి ....

ఆటవికతలధిగమించి
నాగరికత నేర్చావు 
చాకిరీలు తప్పించి 
చక్రం పనిముట్లతో .... // ఓ మనిషి //

పంటలెన్నో పండించి
పస్తులనే  జయించావు
ఎరువులను కనిపెట్టి
ఉత్పత్తులు పెంచావు  // ఓ మనిషి //

పరిశ్రమలు స్థాపించి
పద్ధతులు మార్చావు
అవసరాలు గుర్తించి
అధిగమించి నిలిచావు // ఓ మనిషి //

సాంకేతికతలల్లుకుని
సౌలభ్యాలు పెంచావు
పతంగిలా ఎగిరినీవు
తరంగాలు తట్టినావు   // ఓ మనిషి //

అవయవాలు మార్చి నీవు
అపర బ్రహ్మవైనావు
పాలపుంతలు కనిపెట్టి
పక్క గ్రహలెక్కావు     // ఓ మనిషి //

ఎనలేని విజ్ఞానం 
ఎంత నీవు పొదువుకున్నా
మానవతను విడవకు 
మనిషినని  మరవకు  // ఓ మనిషి //

నగునూరి రాజన్న

No comments:

Post a Comment