Wednesday, July 3, 2024

కొన్ని ఆనందాలను ఒంపుకుందాం తేది : 27-02-2024

 కొన్ని ఆనందాలను ఒంపుకుందాం 

తేది : 27-02-2024
శీర్షిక : 
సహస్రాధికం 

అశాశ్వతమైన జీవితములో 
ఆశల అత్యాశల సుడిగుండాలు 
కలకాలం ఏవీ శాశ్వతం కాకున్నా   
కష్టసుఖాల కావడికుండలు.. 

పరులకొరకై పరుచుకున్న 
ప్రకృతికే తప్పని గాయాలు... 
అయినా వీడని పట్టుదలలే 
ఆహరహరం ఆనందాల పంపకంలో... 

ఆచ్చాదనలే  లేని శిలలను 
అపురూప శిల్పంగా మార్చిన 
శిల్పి కైనా తప్పని ఎన్నో రుధిర 
మదనాలు దీన వదనాలు .... 

నయన మనోహరములైన 
సప్తవర్ణ కాంతుల సరాగాల 
రవివర్మల చిత్రాలకైనా .... 
కొదువలేదనుకునే మహారాజుల 
రాజరికపు కట్టడాలకైనా...  
వెనక దాగిన కష్టాలనంతం ..... 

ధన ఋణ తులనంలో 
దాగిన మతలబేదైనా .... 
కొన్ని ఆనందాలను సదా 
ఒంపుకుంటూ సాగిపోవడమే 
జీవిత పరమార్థం.   


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment