చైతన్య గేయాలు
తేది : 27-01-2024
శీర్షిక : ఓ యువతా మేలుకో
ఓ యువతా మేలుకో
నీ భవితా తెలుసుకో
సనాతనం వినాశమని
మన సంస్కృతి విషమమని
స్వార్ధ మూతి పిందెలు
సన్నాసులై బోధిస్తరు
చెప్పుడు మాటలన్నీ
చెవిన ఎక్కించుకోకు
తప్పుడు లెక్కలను
ససేమిరా ఒప్పుకోకు
మడత పేచీలను
మనసుపెట్టి గుర్తించు
మర్మములను గ్రహించు
సకారమై ఆచరించు ...
మత్తులో మునగకురా
గమ్మత్తుందని మురువకురా
నీ సత్తువను చంపకురా
నిస్సత్తువను చేరదీయకురా ....
రంగు లైట్ల వెలుగుల్లో
రందుల మరుపున్నదని...
పబ్బు మత్తు మందుల్లో
డబ్బులు కుమ్మరిస్తూనే ....
ఓ యువతా మేలుకో
నీ భవితా తెలుసుకో
విభజించి పాలించే
వినాయకులను గుర్తించు ...
మేకవన్నె పులులతో
మెలకువగా ప్రవర్తించు ...
కల్లబొల్లి మాటలను
కంట కనిపెట్టుకుంటూనే ....
స్వార్థముతో సర్దుకునే
సన్నాసుల పని పట్టు ..
ఓ యువతా మేలుకో
నీ భవితా తెలుసుకో
సమంలేని ఐదు వేళ్లు
సాధించి చూపినట్టు...
ముద్దనోటికందించి
కడుపు నింపినట్టుగా .....
మతమంటే మానవతని
మన సంస్కృతి గొప్పదని ...
కులమంటే పని విభజనని
కులాసాగా కలిసి సాగు ....
ఓ యువతా మేలుకో
నీ భవితా తెలుసుకో
రాజకీయం రొచ్చని
తప్పుకోకు సోదరా ....
నైపుణ్యం ఒప్పులతో
మెప్పుపొంది గెలవరా ....
గొప్పోళ్ళు ముప్ఫైల్లోనే
సాధించి చూపారు ...
రామానుజం లెక్కల్లోన
నరేంద్రుడు సంస్కృతిలోన ...
ఓ యువతా మేలుకో
నీ భవితా తెలుసుకో
నగునూరి రాజన్న
No comments:
Post a Comment