Saturday, July 13, 2024

యుగళ గీతాలు తేది : 03-12-22

 యుగళ గీతాలు 

తేది : 03-12-22
కవిత సంఖ్య : సహస్రాధికం 

అతడు ... 
బంతివా ... చామంతివా ... 
మరువ దవనాల పరిమళానివా ... 

ఆమె ... 
ఇంతినే .... చామంతినే 
పరువాల దమయంతినే .... 

చరణం .... 
చారెడేసి కళ్ళున్నా చందమామా 
మూరెడేసి కొప్పులోన మల్లెలు తురిమి... 
దోచినావే నా మనసు నంగనాచిగా ... 

చరణం .... 
బిర్రు కండలున్న మామయ్యా 
కిర్రు చెప్పులేసిన ఓ బాబయ్యా 
దోచానా నీ మనసు దొంగలాగా .... 

చరణం .... 
వరసైనదానా  నా మరదలు పిల్లా 
గలగల మాటల్లో నేను గల్లంతయ్యానే 
కిలకిల నవ్వుల్లో నే చిక్కుకున్నానే...  

చరణం .... 
గడసరిగా మాటాడే మామయ్యా 
గమ్మత్తుగా మైకంలో ముంచావే 
ఉవ్వెత్తున అర్పించెద నా సొగసే ... 

ఇద్దరు ... 
నింగమ్మా  నేలమ్మా సాక్షిగ నీవే 
ఎన్నెన్నో జన్మాల బంధములే  మావి 
ఎదమీటి సాగేటి మా  ప్రేమకూ
ఎదురొచ్చి దీవించు ఇక  దేవతలు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment