కలల పుట్టుక
తేది: 26/27-09-23
శీర్షిక : మస్తిష్కంలో అంకురాలే…
కలలైనా మనం చేసే కర్మలైనా
పుట్టి పెరిగిన మట్టివాసనలో
నిత్య బోధనల మంచిచెడులో
మస్తిష్కములో అంకురించే
మొలకలే...
కలుపు గడ్డో… కల్పవృక్షాలో…
విజ్ఞాన వీచికల వివేక విచక్షణల
తోటమాలి మాటసాయంతో
పెంచి
పెద్దచేసుకుని పచ్చగా
పరిఢవిల్లాలి...
కలలు మన సొంతమైనా
కలకాలం నిలవాలంటే
కలాము గారిలా స్వార్థం వీడాలి ....
పదుగురి క్షేమం కోరాలి ...
అందమైన హరివిల్లులతే
ఆనందాల పొదరిల్లే ...
అనంత విశ్వపు విస్ఫోటన
కారక మైతే అంతా వినాశమే...
మనిషిగా పుట్టినందుకు
ధన్యజీవులం కావాలంటే
మహర్షులం కాకపోయినా సరే
మహమ్మారులం కాకూడదు...
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment