Sunday, July 14, 2024

అలవికాని ఆరాటం తేది 10-10-2023 శీర్షిక : అత్యాశకు కళ్ళెం

 అలవికాని ఆరాటం 

తేది 10-10-2023
శీర్షిక : అత్యాశకు కళ్ళెం -
సహస్రాధికం. 

 అంతులేని ఆశల గూడు 
 అక్కరలేకున్నా నెత్తిన గోడు ... 
 భూబకాసూరులౌతున్న తీరు చూడు 
 కోట్లకు పడగలెత్తే నాగన్నలాయె నేడు ...

పశుపక్ష్యాదులే చాలా నయం 
అక్కరపూర్తి వరకే వాటి లోకం 
మనిషికెందుకో మరి ఈ మలినం 
అక్కరలేకపోయినా సాగి దూరడం ... 

అందరిపైనా చలాయించాలని అధికారం 
ఆశల కొలిమిలో నిప్పులనెక్కి పోరాటం 
వేలకోట్లతో పంచే ఫలహారం 
ప్రజా జీవితాలకు కాదా చెలగాటం … 

విజ్ఞానాల విద్వాంసులం 
వివేక విచక్షణల సంపదలం … 
విడమరిచి చెప్పగలిగే ఉద్దండులం 
వింతగ స్వార్థాన్ని జయించలేని అసమర్థులం ... 

ఆశలను అదుపులో ఉంచి 
 అత్యాశలకు కళ్లెం వేస్తూ 
 అపార జన సౌఖ్యాలను గుర్తించి 
 నడచుకోవడమే అసలైన మనిషితత్వం ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment