ఆన్‌లైన్ స్నేహాలు.
తేది: 26-10-2023
శీర్షిక : మంచి చెడుల సంగమం.
ముఖ పరిచయాల ముత్యాలు
రాలకున్నా
లేఖా మాత్రపు విహంగాలతో
కలం స్నేహితుల
కాలం వెలిగిపోయింది సాహితీ వనములో
సన్నజాజుల పరిమళాలని వెదజల్లుతూ ఒకప్పుడు…
తపాలా శాఖల తప్పిదాలతలో… పోలికలున్న
పొలిమేరల ఊర్లపేర్లకు పొరపాటున జరిగే
ముఖ్యమైన బట్వాడాలతో కూడా మురిసి
పోయేవి కొన్ని కలం స్నేహాల కపోతముల సోపతులు….
సాంకేతికత సౌరభాల పరిమళాలు
వెదజల్లుతుంటే
సర్వ విశ్వం యువతకు
అరచేతిలో ఇమిడిపోగానే
ఫేస్ బుకులో తొంగిచూసి ఇన్స్టాలో ఇష్టాలను
ఫాస్టు ఫాస్టుగా సోపతులను కలుపుకుని
పంచుకుంటూ…వాట్సాప్ లో వరస కలుపుకుని…
ట్విట్టర్ పిట్టలా పలకరిస్తూ…టిక్ టాక్ లతో ఊరించి..
X లో కొట్టుకుని....యూట్యూబులో లైక్ లు ఇచ్చుకుని..
టెలిగ్రామ్లో మతలబులు పంచుకుంటున్నారు…..
ప్రపంచీకరణ ఫలితాలను పొదువుకుంటున్న
నేపథ్యంలో….నాణేనికిరువైపులలా… మంచి
మాత్రమే కాకుండా… దానికి మించిన చెడులు కూడా
తోడై అప్పుడప్పుడు తోడేళ్ళను తలపిస్తున్నాయి…
తేనెల మాటల తేనీటి విందుల పలకరింపులు
మధురవాక్కుల బుదగరింపులలా ఒయ్యారాలు
గుడుగుడుగుంచెం గుడిలో రాగంలా మురిపాలు
చెవిలో ఇల్లు కట్టుకున్న చేటులా ... అవుతుంటే
ఎడ్డి మాలోకమైతే గుడ్డిగా నమ్మి మోసపోవడమే
పని అవుతుంది ....
మారుతున్న విశ్వంలో మనమూ మనాలంటే
సమకాలీన సాంకేతికతల సౌలభ్యాలను
ఎప్పటికప్పుడు అవగాహనలతో అవపోశనపట్టి
ఆచరించడమే అత్యంత ఉత్తమం…
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment