Saturday, July 13, 2024

కలల లోగిలి తేది 07-11-2023 శీర్షిక - తరంగం…

 కలల లోగిలి 

తేది 07-11-2023
శీర్షిక - తరంగం… 

జీవరాశిలో దివ్యమైన వైవిద్యం
దైవమిచ్చిన విభిన్నతల  వరం 
సత్తా వెలుగుల మానవ మేధ తథ్యం 
ప్రతి ఆలోచన తరంగం ప్రగతే గమ్యం 
కావాలి… 

మనసు తెరపై మయూరమై 
లోగిలిలో హొయలొలికి కొన్నిసార్లు 
మార్గనిర్దేశనలతో పెద్దముత్తైదువై 
పేరు ప్రతిష్టల మూటలందిస్తది....

కుసుమ తేనియల భ్రమరమై తీపి గురుతులు 
మిగిల్చినా… పొరపాటున చేదు గుళికలై 
గొంతులో పడినా.. సరాగాల స్వప్నాల తోటలో
విహరిస్తూ సుమపరిమళాలను వెదజల్లుతుంటాయి… 

 వింతలకే వింత తుళ్లింతల తూనీగ
 ఇలలో చూసినవైనా విన్నవైనా 
 కొన్నిసార్లు చూడనివైనా విననివైనా 
 చుట్టంలా వచ్చి పలకరిస్తుంటాయి ... 

అన్నింటిని ఆదరిస్తూ పోవాల్సిందే.. 
ఆశల ప్రతిరూపాలను మాత్రం అవపోశనపట్టి 
దీక్షా దక్షతలతో ఒడిసిపట్టుకుని 
ప్రతిఫలాల బుట్టను అందుకోవాలి..


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment